Home / ANDHRAPRADESH / బాలయ్య డైరెక్టర్ కామచేష్ట..పబ్లిక్ గా హీరోయిన్ ని వాటేసుకుని ముద్దులు..!

బాలయ్య డైరెక్టర్ కామచేష్ట..పబ్లిక్ గా హీరోయిన్ ని వాటేసుకుని ముద్దులు..!

బాలీవుడ్ కే పరిమితమైన హగ్గింగ్ , కిస్సింగ్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకుతోంది..సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రమోషనల్ ప్రెస్ మీట్లలో హీరోయిన్లను, కోస్టార్లను వాటేసుకుని ముద్దులు పెట్టడం కామన్ అయింది..ఇందుకు స్టార్ హీరోలు కూడా అతీతం ఏం కాదు..గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి…లేదా కడుపైనా చేయాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ పై దుమారం చెలరేగింది..వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ హనీరోజ్ వంక చూస్తూ బాలయ్య చేసిన అసభ్య సంజ్ఞలు మీడియాలో వైరల్ గా మారాయి..ఇక బోళా శంకర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో సిస్టర్ పాత్ర వేసిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను హగ్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ బీభత్సమైన ట్రోలింగ్ కు తెగబడ్డారు.

తాజాగా బాలయ్య డైరెక్టర్ రవికుమార్ చౌదరి హీరోయిన్ మన్నారా చోప్రా భుజంపై చేతులు వేసి దగ్గరకు లాక్కుని ముద్దులు పెట్టడం కాంట్రవర్సీగా మారింది. బాలయ్య నటించిన వీరభద్ర అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గోపీచంద్ తో యజ్ఞం, సాయిధరమ్ తేజ్ తో పిల్లానువ్వులేని జీవితం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా లైమ్ లైట్ లో లేని రవికుమార్ చౌదరి తాజాగా రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామీ అనే సినిమాను తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా ఓ కీలక పాత్రలో నటించింది.

తాజాగా ఈ మూవీ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత హీరోయిన్ మన్నారా చోప్రా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. అప్పుడు వచ్చిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి తన కామచేష్టలు మొదలెట్టాడు..ఆమె భుజాలపై చేతులు వేసుకుని దగ్గరకు లాక్కుని మరీ ఫోజులు ఇచ్చాడు..డైరెక్టర్ కావడంతో తను కూడా సరదాగా తీసుకుని ఫోటోలు దిగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా మన్నారా అనుమతి లేకుండా బుగ్గపై బుద్దులు పెట్టేశాడు రవికుమాన్ చౌదరి. దీంతో కాసేపు షాక్ అయిన మన్నారా చోప్రా..నవ్వుతూ పక్కకు జరిగింది..ఆమె కాస్త ఇబ్బంది ఫీల్ అయినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ రవికుమార్ చౌదరి తీరుపై నెట్ జన్లు గుస్సా అవుతున్నారు..గతంలో చోటా కే నాయుడు కూడా కాజల్ కు ఇలానే ముద్దు పెట్టిన వైనాన్ని గుర్తు చేస్తూ..ఎంత హీరోయిన్లు అయినా వారి అనుమతి లేకుండా ఇలా ముద్దులు పెట్టడం ఏం బాలేదని బాలీవుడ్ తరహా కల్చర్ టాలీవుడ్ లో కూడా మొదలెట్టారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat