టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 100 నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి , సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆయన ఆస్తులు లాక్కుని మానసిక క్షోభకు గురిచేసి, ఆయన చావుకు పరోక్షంగా కారకులైన ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, బావ వెన్నుపోటుకు సహకరించిన బాలయ్యతో సహా నందమూరి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తిగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ నిర్వహించిన ఈ ప్రైవేటు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించింది…ఇదీ ఎన్టీఆర్ కోసం టీడీపీ సాధించిన ఘనత అంటూ పచ్చ మీడియా రోజంతా ఊదరగొట్టింది.
అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ద్వితీయ సతీమణి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం లేకపోవడం రాజకీయంగా వివాదానికి దారి తీసింది. తనను ఎన్టీఆర్ స్మారక నాణేం విడుదల కార్యక్రమానికి పిలవకపోవడంపై లక్ష్మీ పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పురంధేశ్వరీ, చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరీలే అసలు విలన్లు అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం అందలేదని నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త పేరు మీద విడుదల చేసే నాణేం కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లక్ష్మీపార్వతి లేఖరాశారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ నాణేం విడుదల కార్యక్రమం టీడీపీ, బీజేపీ కార్యక్రమంగా జరిగిందంటూ వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం డ్యామేజీ కంట్రోల్ కు దిగింది. ఆర్బీఐ కేవలం ఎన్టీఆర్ నాణేం ముద్రించడం మాత్రమే చేసిందని…విడుదల కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు లక్ష్మీపార్వతికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.100నాణేం విడుదల కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని అది ప్రభుత్వం నిర్వహించేది కాదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.. దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి మేరకే రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్టీఆర్ నాణేం విడుదలకు సంబంధించి అధికారికంగా ఎక్కడా కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్రపతి భవన్ కానీ ఎలాంటి ఆహ్వానాలు అందించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీ ఆర్ నాణేం విడుదల ప్రైవేటు కార్యక్రమమైనందునే లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎన్టీఆర్ నాణేం విడుదల అధికారిక కార్యక్రమం అయితే తప్పకుండా లక్ష్మీపార్వతికి కూడా ఆహ్వానం పంపేవారిమంటూ ప్రభుత్వ వర్గాలు ఆమెకు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించిందంటూ..ఎన్టీఆర్ సతీమణిని లక్ష్మీ పార్వతిని లెక్కలోకి తీసుకోలేదంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అనుకుల మీడియాకి…అది ప్రైవేటు కార్యక్రమం అని, అధికారిక కార్యక్రమం కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఫ్యూజులు ఎగిరిపోయాయి..అంతే ఈ విషయంపై మాట్లాడకుండా గప్ చుప్ అయిపోయింది. మొత్తంగా రూ. 100 నాణేంప్రైవేటు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రచారం చేసి చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్ పరువును రోడ్డున పడేసారంటూ అసలు సిసలు నందమూరి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.