ప్రస్తుతం వచ్చే నెలలో చేసుకోనున్న వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయమై సర్వత్రా గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 19న నిర్వహించుకోవాలని హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొన్నది..
అయితే సెప్టెంబర్ నెలలో 18నే జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ఈ సందర్భంగా ప్రకటించింది. 18న ఉ.9.58 నుంచి చవితి ప్రారంభమై 19న ఉ.10.28కి ముగుస్తుంది..
నవరాత్రులను అదే రోజు ఆరంభించాలని విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే సెప్టెంబర్ 18న సెలవు ప్రకటించింది.