సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి… – పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి …
Read More »ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్
ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
Read More »భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు . అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలన్నారు. తెలంగాణలోనే కాదు, దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలన్నారు. సంపదలను ఇచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. ఇకపై ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు
Read More »‘భోగి’ పండుగ అంటే ఏంటీ ?
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం …
Read More »తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు
తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ …
Read More »జనవరి 13నుండి ఐనవోలు జాతర
ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాఖీ కట్టిన సోదరీమణులు
రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.
Read More »27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతి
వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్ గణపతి గుర్తుకు వస్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్టించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …
Read More »చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క..!
మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని …
Read More »చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క
మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని వస్తున్నారు …
Read More »