తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మారిముత్తు హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఓ సీరియల్ కు డబ్బింగ్ చెబుతూ మారి ముత్తు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు..
దీంతో అక్కడ ఉన్న సిబ్బంది సమీపాన ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తేల్చి చెప్పారు. కాగా ఈ నెల రెండో తారీఖున ఆయన ఇరవై ఏడో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.
ఇంతలోనే ఈ సంఘటన జరగడం పెద్ద షాక్ కు గురిచేసిందని ఆయన అభిమానులు, నెటిజన్లు,కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు వాపోతున్నారు. మారిముత్తుకు సహచర నటీనటులు ,ఇతర సిబ్బంది సంతాపం తెలుపుతున్నారు.అనేక టీవీ సీరియల్స్‌లలో కూడా నటించాడు. తమిళ టెలివిజన్ సిరీస్ ఎతిర్నీచల్‌లో ఆయన పాత్రకు పాపులారిటీ దక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీలోనూ కీలక పాత్రలో నటించాడు.