తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్. నామినేషన్ దాఖలు అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి కేసీఆర్ బయల్దేరారు కేసీఆర్.
అక్కడ మధ్యాహ్నం 2 గంటల లోపు కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగంపై జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.