భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (38) ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ (అన్ని ఫార్మాట్లు)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించింది. ఇంగ్లాండ్ తో చివరి వన్డే ద్వారా మిథాలీ ఈ ఫీట్ అందుకుంది.
అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ ఎడ్వర్డ్స్ (10,273 రన్స్) పేరు మీద ఉండేది. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో 10 వేల రన్స్ చేసిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే.