ఏపీలోని రాజమండ్రి స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌కు రాజమండ్రి బాలాజీపేట వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో పలు ట్రైన్లు రద్దు అయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఒకే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీనివల్ల చాలా ట్రైన్లు బాగా ఆలస్యం అవుతున్నాయి. ఇక ఈరోజు బయల్దేరాల్సిన 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. రెండింటిని పాక్షికంగా నిలిపివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ విషయాన్ని విజయవాడ రైల్వే డీఆర్ఎం ట్వీట్ చేశారు.
రద్దయిన రైళ్లు ఇవే..
విజయవాడ – విశాఖపట్నం, గుంటూరు- విశాఖపట్నం, విజయవాడ – గుంటూరు, విజయవాడ- కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ- లింగంపల్లి (12805) రైలును 2 గంటల ఆలస్యంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.