చిత్ర సీమలో నటుల దశ ఎప్పుడు.. ఎలా.. మారుతుందో ఎవ్వరికీ తెలియదన్నది నిత్య సత్యం. ఇందుకు నిదర్శనంగా టాలీవుడ్‌లోనే కాదు, మల్లీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,, ఇతర చిత్ర సీమల్లో ఉన్న నటులు, నటీమణులు చాలామందినే. అయితే, తాజాగా ఈ జాబితాలో పంటిమీద పన్ను ఉన్న కలర్స్ స్వాతి కూడా చేరింది. ఒకానప్పుడు ఓ ప్రముఖ ఛానెల్‌లో కలర్స్ ప్రోగ్రాం ద్వారా పరిచయమై స్వాతి.. ఆ ప్రోగ్రాం పుణ్యమా అని స్వాతిరెడ్డిగా ఉన్న ఈ భామ పేరు కలర్స్ స్వాతిగా ముద్రపడిపోయింది. అంతేగాక సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది.
తాజాగా ఈ భామ నటించిన లండన్ బాబులు చిత్రం కాస్తా బోల్తా కొట్టింది. అంతేకాదు. అంతకుముందు కలర్స్ స్వాతి నటించిన త్రిపుర చిత్రం పరిస్థితి కూడా ఇదే. అయితే, కలర్స్ స్వాతికి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తన స్టార్ స్టేటస్ చెక్కు చెదరలేదు. దీనికి కారణం ఆమె యాక్టింగ్ స్కిల్సేనని అంటున్నారు సినీ జనాలు. దీంతో కలర్స్ స్వాతికి అప్పట్లో తెలుగులోనే కాక ఇతర చిత్ర సీమల్లో అవకాశాలు వెల్లువెత్తాయి.
అయితే, ఈ భామకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయట. దీంతో ఈ భామ తనలోని లోపాలను సరిచేసుకునే పనిలో పడింది. అందులో మొదటగా తన ఫిజిక్‌పై దృష్టి సారించింది. సినిమాల కోసం తన ఫిజిక్‌ను మార్చుకోవాలని గట్టిగా ఫిక్సయిందట. అసలే హీరోయిన్ల పోటీ ఎక్కువ ఉన్న తరుణంలో కలర్స్ స్వాతి ఫిజిక్‌పై దృష్టిపెట్టడంతోపాటు తన అందాలను పెంచే పనిలో పడింది. అంతటితో ఆగక.. అందాల ప్రదర్శనకు తనకు అభ్యంతరం లేదని డైరెక్ట్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసింది.