కోలీవుడ్ డైరెక్టర్ విజయ్, హీరోయిన్ అమలాపాల్ రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకుని.. ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు. అయితే, సినిమాల్లో ఇకపై నటించొద్దు అంటూ విజయ్పెట్టిన కండీషన్సే వారి మధ్య బంధాన్ని తెగదెంపులు చేసుకునేలా చేసిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే, విజయ్‌తో విడాకుల తర్వాత తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందని మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చేసింది అమలాపాల్. అది కూడా మళ్లీ ప్రేమ వివాహమే చేసుకుంటానని, తాను ప్రస్తుతం ప్రేమికుడిని వెతికే పనిలో ఉన్నానని తెలిపింది అమలాపాల్.
మరి, డైరెక్టర్ విజయ్‌తో విడాకులు తీసుకున్నాక అవకాశాలు తగ్గాయో ఏమో మరి అమలాపాల్ రోజుకో వార్తతో మీడియాకెక్కుతోంది. ఆ క్రమంలోనే అందాల ప్రదర్శనతో పాటు మాటలతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అయితే, ఇటీవల తాను నటించిన తిరుట్టుపాలై – 2 చిత్రానికి సంబంధించి పోస్టర్ ఒకటి రిలీజైంది. ఈ పోస్టర్లో బొడ్డు కింద చీరకట్టులో కనిపించింది. ఇంకేముంది ఈ ఫోటో కాస్తా వైరల్ అయింది. ఈ పోస్టపై అమలాపాల్ స్పందిస్తూ తాను బొడ్డుకింద చీర కడితే ఇంతలా బజ్ వస్తుందని అనుకోలేదని, అయినా.. మనం ఉన్నది 2017లో అంటూ చిలకపలుకులు పలికింది ఈ భామ.