కింగ్ నాగార్జున ఇప్పుడు అఖిల్ కెరీర్ మీద విపరీతంగా దృష్టి పెట్టి దగ్గరుండి మరీ తీయిస్తున్న సినిమా – హలో! ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త విశేషాలు తెలుస్తున్నాయి. అదిరిపోయే బిజినెస్ ఆఫర్ల దగ్గర నుంచి అమెరికాలో అఖిల్ ప్రమోషన్ల వరకూ చాలా విశేషాలతో ‘హలో’ మనల్ని పలకరిస్తోంది.
అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ లాంటి మంచి హిట్ ఇచ్చి ఏయన్నార్ చివరి సినిమాగా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే చిత్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఆ దర్శకుడి చేతిలో నాగార్జున అఖిల్ కెరీర్ ని పెట్టి, వెనుకనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్. అయినప్పటికీ రెండో సినిమాకు మంచి శాటిలైట్ బేరం కుదిరింది. అఖిల్ నటించిన హలో సినిమాను డీసెంట్ ఎమౌంట్ కు జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. 5కోట్ల 90లక్షల రూపాయలకు తాజాగా డీల్ పై సంతకాలు జరిగినట్టు తెలుస్తోంది. అఖిల్ సినిమాకు ఇంత మొత్తంలో శాటిలైట్ అంటే అది చెప్పుకోదగ్గ విషయమే. అది కూడా మూవీ విడుదల కాకుండానే డీల్ సెట్ అయింది. అయితే అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అన్నీతానై నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఆఖిల్ కు చాలా కీలకం. మొదటి సినిమా డిజాస్టర్ తర్వాత హలో సినిమాను అఖిల్ కు రీలాంఛ్ గా చెబుతున్నాడు నాగ్. ఈ ‘రీలాంఛ్’ కూడా బెడిసికొడితే అఖిల్ కు మళ్లీ గ్యాప్ తప్పదు.