వైసీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 47వ రోజుకి చేరుకుంది.పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు. కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.ఇవాళ ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, తంబళ్లపల్లి, బదలవాండ్లపల్లి మీదుగా రామిగానివారిపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.