నెల్లూరు జిల్లాకు చేరుకున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు షెడ్యూల్ విడుదల అయింది . వైఎస్ జగన్ గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పూట క్రాస్ రోడ్డు, వర్ధరెడ్డి కండ్రిగ, పునేపల్లి, నేమలపుడి వరకు సాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం ఉంటుంది. భోజన విరామం అనంతరం వైఎస్ జగన్ పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి కరబులవొల్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకు పాదయాత్ర కొనసాగనుంది.