జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.గల్ఫ్ బాధితుల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు బాగా పని చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఇవాళ (ఆదివారం జనవరి-28)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టూర్ లో భాగంగా కదిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అయితే వాళ్లను అక్కడ దళారులు వెట్టిచాకిరితో మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకోవాలని తనకు అప్పట్లో విన్నపాలు వచ్చాయన్నారు .అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కటి విధానాన్ని ఏర్పరచుకొని ఎందరికో సాయం చేశారన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి, ఫేక్ ఏజెంట్ల మోసాలతో అక్కడే ఇరుక్కుపోయిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం అండగా నలబడిన విధానం తనకు చాలా నచ్చిందన్నారు. గల్ఫ్ బాధితుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే విధానాలను తయారుచేయాలన్నారు.
