ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ ప్రచారంపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి క్లారీటిచ్చారు..తనపై వస్తోన్న టీడీపీలో చేరతారనే వార్తలపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరతారనే వార్తలను ఆయన ఖండించారు..ఆయన మాట్లాడుతూ తాను టీడీపీలో చేరబోతున్నాను అనే వార్తలలో ఎటువంటి వాస్తవం లేదన్నారు..అవన్నీ వట్టి పుకార్లు అని కొట్టిపడేశారు..తనపై కావాలనే ఇటు వంటి వార్తలను ప్రచారం చేస్తొన్నారు అని అన్నారు…తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ..త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని..అప్పటివరకు తనపై ఇలాంటి బేస్ లేని వార్తలను ప్రచారం చేయవద్దు అని సూచించారు..అయితే ఆయన ఇటీవల వైసీపీలో చేరబోతున్నారు అని వచ్చిన వార్తలపై స్పందించకుండా టీడీపీలో చేరబోతున్నారు అనే వార్తలను ఖండించడం వెనక ఈ మాజీ మంత్రి త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు..చూడాలి మరి డీఎల్ ఏ నిర్ణయం తీసుకుంటారో…?
