ఐపీల్ సీజన్లో బ్యాటింగ్ కు పెట్టిన పేరు రాయల్ ఛాలెంజర్స్ అఫ్ బెంగుళూరు అని సంగతి క్రికెట్ ప్రేమికులకు తెల్సిందే .అయితే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు చేయడమే గగనం అనుకుంటున్న తరుణంలో చివరి వరస బ్యాట్స్ మెన్స్ రాణించడంతో నూరు పరుగులను దాటడమే కాకుండా ఏకంగా నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని
చెన్నై ముందు ఉంచింది బెంగుళూర్ .
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగుళూర్ మొత్తం ఓవర్లను ఆడి తొమ్మిది వికెట్లను కోల్పోయి నూట ఇరవై ఏడు పరుగులను సాధించింది.స్టార్ బ్యాట్స్ మెన్స్ అంతా చేతులెత్తేయడంతో చెన్నై ముందు భారీ స్కోరును ఉంచలేకపోయింది .
ఈ తరుణంలో చాలా రోజుల తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన పార్థివ్ పటేల్ నలబై ఒక్క బంతుల్లో ఐదు పోర్లు ,రెండు సిక్సర్ల సాయంతో యాబై మూడు పరుగులను ,చివరి బ్యాట్స్ మెన్ అయిన టీమ్ సౌథి ఇరవై ఆరు బంతుల్లో మూడు పోర్లు ,ఒక సిక్సర్ సాయంతో ముప్పై ఆరు పరుగులను సాధించడంతో ఆ లక్ష్యాన్ని అయిన కానీ చెన్నై ముందుంచింది .