తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.టీడీపీ నేతలకు వణుకు పుడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై తనదైన స్టైల్ పోరాటాలు చేస్తూ మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు బాబు సర్కారు పై పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్
తాజాగా గత 158 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .ఈ తరుణంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీలో చేరతారని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పై వస్తున్నా వార్తలు ప్రస్తుతం నిజమై విధంగా ఉన్నాయి .
తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది.కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. దివంగత నందమూరి తారకరామావు కుమార్తె, దగ్గుబాటి పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పారు. ప్రస్తుతం 2019 ఎన్నిక ల హడావుడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఏపీలో అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్లు 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొందరికి సీట్ల పంపకాలు, టికెట్ల హామీలు కూడా ఇచ్చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తామన్నహామీ జగన్ నుండి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ భాగా పట్టున్న దగ్గుబాటి ఫ్యామిలీ నుండి పురందేశ్వరి పోటి చేస్తే..అక్కడి రాజకీయ వాతావరణమే పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోతుందని అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు.