అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్‌ను దక్కించుకొన్న తెలంగాణ.. అనంతరం సైతం తన ముద్రను చాటుకుంటూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా నంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలిచింది.
సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం వంద శాతం స్కోర్ సాధించింది. ఢిల్లీలో జరిగిన స్టేట్ బిజినెస్ రిఫార్మ్ అసెస్ మెంట్ 2018 కార్యక్రమంలో భాగంగా సులభతర వాణిజ్యం ర్యాంకులు విడుదల చేశారు. ఈ ర్యాంకుల్లో సంస్కరణల అమలులో తెలంగాణతోపాటు ఏపీ, జార్ఖండ్, గుజరాత్ రాష్ర్టాలు వందశాతం స్కోర్ సాధించగా..అసోం, తమిళనాడు రాష్ర్టాలు ఎక్కువ పురోగతి సాధించాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఛత్తీస్‌గఢ్, పన్నుల చెల్లింపులో ఒడిశా, నిర్మాణ రంగ అనుమతుల్లో రాజస్థాన్, కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్, పర్యావరణ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్ రాష్ర్టాలు వంద శాతం స్కోర్ సాధించాయి. ఈ ర్యాంకుల్లో నంబర్ 2 స్థానంలో తెలంగాణ నిలిచింది.