నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది అని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఫైర్ అయ్యారు.ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఓడిపోతేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ టీడీపీ మంత్రులు ఫెడరల్ ఫ్రంట్‌పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని .. ఫెడరల్ ఫ్రంట్ లేదన్న చంద్రబాబుకు దాని ప్రతాపమేంటో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.చంద్రబాబుకు బంధాలు, బంధుత్వాల విలువ తెలియదని… చేరదీసిన ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన చరిత్ర ఆయనది ఫైర్ అయ్యారు.చంద్రబాబు నాయుడిని ఓడించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు.. ‘ఈ బాబు మాకొద్దు’ నినాదంతో ఏపీ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్తామని తలసాని పేర్కొన్నారు.హరికృష్ణ చనిపోతే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది అని అన్నారు .త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో పర్యటించనునట్లు తెలిపారు.
