ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం బకాయిలను తీర్చింది. కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టుకుని ఎర్రజొన్న రైతులు ఆగం కావొద్దు అని అన్నారు . ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయాలనీ మీతో ధర్నాలు చేయించిన మనుషులు తర్వాత మీతో ఉండరని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని కేసీఆర్ హామీనిచ్చారు. సంచార జాతులకు రూ.1000 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నామనీ కేసీఆర్ తెలిపారు
