రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె అని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై కేసీఆర్ మండిపడ్డారు.” కేసీఆర్ నీవు కూడా హిందూవే అంటున్నవ్గా.. రామజన్మ భూమి మీద నీ స్టాండ్ ఎందీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అడిగిండు. నేనొక మాట అడుగుతున్న లక్ష్మణ్‌గారు మీది రాజకీయ పార్టీయా? ప్రజల కోసం పనిచేసే పార్టీయా? లేకపోతే మత ప్రచారం చేసే పార్టీయా? ఆ స్టాండు ఫస్ట్ నీవు చెప్పు. ఆ తర్వాత నేను చెబుతా. రామ జన్మభూమి-రావణ జన్మభూమి.. శ్రీకృష్ణ జన్మభూమి-కంస జన్మభూమి.. దుర్యోధన జన్మభూమి.. ఇగ సత్యభామ జన్మభూమి, సూర్పణక జన్మభూమి.. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయల్నా? ఏ జన్మభూమి ఎవల్దో, ఎది ఎక్కడ ఉండాల్నో ఎవరు నిర్ణయించాలి? శృంగేరి పీఠంలో జగద్గురువులు, చినజీయర్ స్వామి ఉన్నడు, పీఠాధిపతులు ఉన్నరు, ధర్మప్రచారకర్తలు ఉన్నరు, మఠాలు ఉన్నయి, మతాధిపతులు ఉన్నరు. వాళ్లు చేయాలి. మన రాజకీయ నాయకులు పనికాదు అది. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలనీ ” ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
