ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన మనుసులోని మాటను బయటపెట్టారు.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు పనులు చేయడం లేదు అని స్వయంగా తానే ఒప్పుకున్నారు. నంది కొట్కూర్ నియోజకవర్గంలో గౌరు చరిత గత అసెంబ్లీలో వైసీపీ తరపున గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం నుంచి పోటీ చేస్తున్న గౌరు చరితను చంద్రబాబు ప్రజలకు పరిచయం చేస్తూ… ప్రతిపక్షంలో ఉన్నా చరిత ఎప్పుడూ కూడా గౌరవప్రదంగా ప్రవర్తించేది.నేను తలపెట్టినకార్యక్రమాలకు సగం మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాలేదు. కాని నేను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా గౌరు చరిత నా దగ్గరికి వచ్చి సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేవారు. అయితే, ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున ఆమె అడిగిన పనులు చేయలేదని, చేయనని కూడా చెప్పానని స్పష్టం చేశారు. అయితే అధికారంలో ఉన్న నియోజకవర్గల్లో మాత్రమే పనులు ప్రారంభిస్తారు కాని ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గాల్లో పనులు చేయరా..? అంటూ సోషల్ మీడియాలో పలువురు కౌంటర్ ఇస్తున్నారు.
