లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి మరియు సినీ నటి. తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. అయితే, చిన్న సినిమాలతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అందులో భాగంగానే తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ ఫేం అయిన ఈ అందాల భామ టాప్ లిస్టులో చేరిపోయింది. సొగ్గాడే చిన్ని నాయనా..భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాల్లో నటించిన ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. వెంట వెంటనే సినిమా చేస్తూ బిజీగా .బిజీగా గడుపుతోంది.
అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హారర్ సినిమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏ సినిమా అయినా చేస్తాను కానీ, హారర్ సినిమాలు మాత్రం చేయనని అంటోంది అందాలతార లావణ్య త్రిపాఠి. “హారర్ సినిమాలు అంటే తనకు భయమని, అలాంటి సినిమాలు చేయడం మాత్రం నా వల్ల కాదు. అందుకే, వాటి జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను” అని చెప్పింది లావణ్య.
గతంలో త్రిషకూడా ఇదే మాట చెప్పింది. సీన్ కట్ చేస్తే వరుసగా మూడు హర్రర్ సినిమాలు చేసేసింది. అసలు హర్రర్ సినిమ ఆలో యాక్ట్ చేయాల్సి వస్తే నో చెప్పేస్తానని అన్న త్రిష.. తీరా మూడు హర్రర్ సినిమాలు చేయడం గమనార్హం. అయితే, ఇప్పుడు లావణ్య త్రిపాఠి మాటలు వింటున్న సినీ అభిమానులు మాత్రం.. సినిమా ఇండస్ర్టీ అంటే ఇదేనేమో. చెప్పేదొకటి.. చేసేదొకటి అంటున్నారు సినీ జనాలు.