పాకిస్థాన్ ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశబ్ధాల కిందట సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు మా దేశం శిక్షణ ఇచ్చింది. కానీ అఫ్గాన్ కు అమెరికా సైన్యం వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులు మారాయి. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లపై ఇప్పుడు ఉగ్రవాద ముద్రవేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అమెరికాకు మద్దతుగా మేము చేసిన సాయమే ఇప్పుడు తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
