తెలంగాణలో త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఆయా కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.
13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు.
మీర్‌పేట్ మేయర్ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం మేయర్ పదవి ఎస్సీకి కేటాయించారు. జవహర్‌నగర్, బండ్లగూడ, నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పదవులను బీసీకి కేటాయించినట్లు ఆమె తెలిపారు.