నిత్యం సోషల్ మీడియా వేదికగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై , ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు పిడి. మరో ఆసక్తికర విషయమేంటంటే.. రాహుల్ అధికారిక ట్విటర్లో ట్వీట్లు పెట్టేది కూడాఈ కుక్కేనట.
రాహుల్ గాంధీ.. ఈ విషయాన్ని పిడి వెల్లడిస్తున్నట్లుగా ట్విటర్లో పేర్కొంటూ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇతని కోసం రోజూ ఎవరు ట్వీట్లు చేస్తుంటారని చాలా మంది అడుగుతున్నారు.
నేరుగా చెప్పేస్తున్నాను. అది నేనే. నాపేరు పిడి. నేను అతని కంటే స్మార్ట్. ట్వీట్‌తో నేను ఏం చేయగలనో చూడండి.’ అని ట్వీట్లో పేర్కొన్నారు.రాహుల్ పోస్ట్ చేసిన వీడియోలో కుక్కకు బిస్కెట్ నోటికి అందివ్వకుండా దాని ముక్కుపై పెట్టడం అది తెలివిగా బిస్కెట్ తినడం ఆకట్టుకుంటోంది.