కోల్‌కతా: గురువారం వెల్లడైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగుచోట్ల బీజేపీ, ఒక చోట ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడంపై బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఈ ఎన్నికల విజయం 2024 లోక్‌సభ తీర్పును రిఫ్లెక్ట్ చేస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు …
Read More »షాక్.. అక్కడ లీటర్ డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 పెంపు..
అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు భారీగా పెరగంతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతుండటంతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. శ్రీలంకలో ఎవరూ ఊహించని రీతిలో అక్కడి ఆయిల్ విక్రయ సంస్థ ఎల్ఐఓసీ పెద్ద మొత్తంలో రేట్లు పెంచేసింది. లీటర్ డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 రూపాయిల భారం వేసింది. దీంతో ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.254కి, డీజిల్ రూ.214కి చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి …
Read More »కేబినెట్‌లో చోటు దక్కకపోతే.. రీషఫిల్‌పై సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విజయవాడ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (రీషఫిల్)పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు ఉదయం శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ రీషఫిల్‌పై సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా …
Read More »కాంగ్రెస్‌లో భట్టిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులున్నారు: కేటీఆర్
హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఏమైందంటే.. బడ్జెట్‌పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్‌రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి …
Read More »అయ్యో కాంగ్రెస్.. మరీ ఇంత ఘోర ఓటమా?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని మిగిల్చాయి. ఎంతో చరిత్ర కలిగిన హస్తం పార్టీ.. కొత్తగా ఎక్కడా అధికారంలోకి రాకపోగా ఉన్న పంజాబ్‌లోనూ అధికారాన్ని కోల్పోయింది. జాతీయ పార్టీ అయినప్పటికీ నాయకత్వ లేమి, పార్టీలో ఉన్న గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఈ దీనస్థితిని తీసుకొచ్చాయి. యూపీలో ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. కేవలం రెండుస్థానాలకే పరిమితమైంది. పంజాబ్‌లో ఆప్‌తో హోరాహోరీ ఉంటుందని భావించినా అలాంటిదేమీ …
Read More »పంజాబ్‌లో దుమ్ములేపిన ఆప్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవే..
దిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. యూపీ, పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎగ్జిట్‌పోల్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వచ్చాయి. యూపీలో తొలి నుంచే అధికార బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్‌లోనూ కాషాయ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. …
Read More »త్వరలో మార్కెట్లోకి ఐఫోన్ కొత్త మోడల్.. కాస్ట్ ఎంతో తెలుసా?
కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. తమ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ ఈవెంట్‌లో కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈ 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీతో వర్క్ చేయనుంది. ఈనెల 18 నుంచి అమెరికా మార్కెట్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 5జీ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది. ఈ ఐఫోన్ ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండనున్నాయి. అమెరికాలో …
Read More »దేశాన్ని బాగుచేయడం కేసీఆర్ వల్లే అవుతుంది: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ తీసుకురాలేదని ఆరోపించారు. మతకలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లలో …
Read More »నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఆపర్చ్యునిటీ: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారని.. దీన్నినిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏడేన్నరేండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసిందని.. అలాంటి వారు ఆనందపడే రోజు ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వారికి గోల్డెన్ ఆపర్చ్యునిటీ అన్నారు. నిజాం కాలేజ్‌లో నిర్వహించిన గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి కేటీఆర్ …
Read More »ఇద్దరు సీఎంలకు బిగ్ థాంక్స్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించి సహకారం అందిస్తున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి థాంక్స్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకి ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందిస్తున్న సహకారం సినిమా ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ అవుతుందన్నారు. మరోవైపు ఏపీలో …
Read More »