ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్న అల్లు అర్జున్.. వాటికి సంబంధించి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.
Read More »హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద MMTS ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »మరో మూడు రోజులు భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకి వద్దు!
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం అతిభారీ, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆ నీరు …
Read More »ఓటీటీలో భారీ బడ్జెట్ సినిమాలు.. ఇకపై అన్ని రోజులు ఆగాల్సిందే!
ఇకపై థియేటర్‌లో విడుదలయ్యే భారీ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి రావు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. థియేటర్‌లో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరిమిత బడ్జెట్‌తో రిలీజ్ అయిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు టికెట్ ధరలు కూడా సాధారణ థియేటర్లు, సి క్లాస్‌లో …
Read More »కేసీఆర్ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్ చేయలేరు: జగదీష్‌రెడ్డి
కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …
Read More »ఏక్‌నాథ్‌షిండేపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తనను మోసం చేశారని.. తాను లేవలేని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై కుట్ర పన్నారని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కూలిపోయే విషయంలో షిండే వ్యవహరించిన తీరుపై ఉద్ధవ్ తీవ్రంగా మండిపడ్డారు. షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. ఆయన్ను తానే సీఎంగా చేసినా అతడిలో …
Read More »వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా?: బొత్స
ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని తేల్చి చెప్పారు. టీచర్లు 8 …
Read More »బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …
Read More »బాలుడికి తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చేసిన జగన్.. కాస్ట్ ఎంతో తెలుసా?
వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పుచ్చకాయలపేటలో వరదబాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోఅక్కడ ఉన్న నక్కా విజయలక్ష్మి 8 నెలల కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఈ సమయంలో సీఎం జేబులో ఉన్న పెన్‌ను బాలుడు తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త కింద పడింది. వెంటనే అధికారులు ఆ పెన్‌ను తిరిగి …
Read More »అప్పుడు నేనొస్తే అందరూ నా చుట్టే తిరిగేవారు.. : జగన్
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే …
Read More »