రానున్న ఒకట్రెండు గంటల్లో హైదరాబాద్ నగర పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించిన నేపథ్యంలో సోమవారం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సిటీలోని సోమవారం రాత్రి వర్షం కురిసింది. మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలపడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నగరంలోని ఉద్యోగులు, ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు సహాయ …
Read More »హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ క్యాంప్ ఆఫీస్ వద్ద గుడాటిపల్లి నిర్వాసితులు ధర్నాకు దిగారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తమకు ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భూ నిర్వాసితులు వారిపై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
Read More »రైతులకు మేలు చేసేందుకు దేశంతో పోటీ: జగన్
కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా? ఎందుకు క్రాప్ హాలిడే అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా పథకం కింద రూ.2,977కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేసే …
Read More »సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా హైదరాబాద్: కేటీఆర్
హైదరాబాద్ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భాగ్యనగరం సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్ సిటీలో జాన్సన్ కంట్రోల్‌కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్ హైదరాబాద్‌లో ఉందని.. ఇమేజ్ టవర్స్‌ను సైతం నిర్మిస్తున్నామని …
Read More »మిగతా వాళ్లకీ బూస్టర్ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్
18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ మాట్లాడారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని …
Read More »నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వైఎస్సారే: కొండా సురేఖ
ఈరోజుల్లో తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి దివంగత సీఎం, ప్రజానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లేనని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆమె.. అక్కడ కంట్రోల్‌రూమ్ ఎదురుగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ …
Read More »పురందేశ్వరికి కొడాలి నాని హెచ్చరిక
గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అడ్డుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ల నిర్మాణాన్నిఅడ్డుకోవడం దారుణమని విమర్శించారు. గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. …
Read More »సముద్రంలో గుట్టలకొద్దీ బంగారం.. విలువెంతో తెలుసా?
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుట్టల కొద్దీ బంగారం, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. కొలంబియా దేశంలోని సముద్ర గర్భంలో గోల్డ్ కాయిన్స్‌ను భారీగా గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గుర్తించిన బంగారం విలువ 17 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 17 బిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా.. ఇండియన్ క రెన్సీలో సుమారుగా 1.32లక్షల కోట్లు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ నౌక మునిగిపోయిందని.. ఆ …
Read More »తొలి క్రికెటర్.. రికార్డులతో అదరగొట్టిన బాబర్ అజమ్
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజమ్ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా 9 అర్ధశతకాలు చేసిన తొలి ఆటగాడిని బాబర్ రికార్డు సృష్టించారు. వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌తో బాబర్ రికార్డు వేట మొదలైంది. ఆ మ్యాచ్‌లో 197 పరుగులు చేసిన బాబర్.. ఆ తర్వాత మూడో టెస్ట్‌లో 66, 55 పరుగులు …
Read More »సారీ.. ఆ గందరగోళంలో మేం గమనించలేదు: విఘ్నేష్ శివన్
ఇటీవలే వివాహం చేసుకున్న ప్రముఖ సినీనటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాదంలో చిక్కుకున్నారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో సారీ చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నయన్, శివన్‌ల కొత్త జంట శుక్రవారం వచ్చింది. దర్శనం తర్వాత తిరుమల మాడ వీధుల్లో వారు చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయం వద్ద ఫొటోషూట్ చేసుకోవడంపై వివాదం చెలరేగింది. …
Read More »