టెన్త్ విద్యార్థులకు లేనిపోనివి చెప్పి వాళ్ల ఆత్మహత్యలకు టీడీపీ నేత నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటి పనులు చేయొద్దని చెప్పేందుకే లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. అమరావతిలో మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. తాను డైరెక్ట్‌గా తన జూమ్ ఐడీతో వెళితే లోకేష్ మాట్లాడరని.. అందుకే తన మేనల్లుడి లింక్‌తో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. టెన్త్ …
Read More »వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే కావాలి: జగన్
రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు కూడా గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైకాపా అధినేత, సీఎం జగన్ సూచించారు. అమరావతిలో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు. ముఖ్యనేతలతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మనందరి లక్ష్యం కావాలని.. అది కష్టం కూడా కాదని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని.. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని …
Read More »ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
ఇండియాలో సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఢిల్లీలో రేపు తొలి మ్యాచ్ జరగనుండగా.. 12న కటక్, 14న వైజాగ్, 17న రాజ్‌కోట్, 19న బెంగళూరులో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని జట్టులో హార్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ …
Read More »మెట్రో స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..
మెట్రో స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 90 వాహనాలు కాలిపోయాయి. ఢిల్లీలోని జామియా నగర్ మెట్రోస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు. 10 కార్లు, ఒక బైక్, 80 ఈ-రిక్షాలతో పాటు మరికొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 11 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశాయి. మంటలు ఎందుకు వచ్చాయనే విషయంపై పోలీసులు విచారణ …
Read More »బీచ్‌లో అనసూయ అందాల ఆరబోత..
మనల్ని తిట్టిన వాళ్లే సడెన్‌గా పొగుడుతారు: పవన్ ట్వీట్ వైరల్
పొత్తులపై జనసేన ముందు మూడు ఆప్షన్లు అంటూ ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీతో ప్రభుత్వాన్ని స్థాపించడం, టీడీపీ+బీజేపీతో కలిసి స్థాపించడం , జనసేన ఒక్కటే స్థాపించడం.. ఇలా మూడు ఆప్షన్ల గురించి ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా 2014, 2019 ఎన్నికల్లో వెనక్కి తగ్గామని.. ఈసారి మాత్రం అలా ఒప్పుకోబోమంటూ పరోక్షంగా సీఎం పదవి జనసేనకే దక్కాలంటూ వ్యాఖ్యానించారు. అప్పటి వరకూ …
Read More »మాల్ ప్రాక్టీస్ లేకుండా కఠినంగా వ్యవహరించాం: సజ్జల
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో …
Read More »కొత్తగా చేరే గవర్నమెంట్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
గవర్నమెంట్ డాక్టర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ జీవోను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించింది. ఇది వరకే ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నవాళ్లు తమ ప్రైవేట్ ప్రాక్టీస్‌ను కొనసాగించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్‌ను ప్రభుత్వం సవరించింది. త్వరలో రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సహా ఇతర సిబ్బందిని నియమించనున్నారు. …
Read More »పవన్ కల్యాణ్‌కి కేఏ పాల్ బంపర్ ఆఫర్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా …
Read More »నేను చెప్పేవి చూపించే ధైర్యం ఆ రెండు ఛానళ్లకు ఉందా?: దివ్యవాణి
టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత, సినీనటి దివ్యవాణి అన్నారు. తెలుగుదేశంలో ఇప్పటికీ ఎంతోమంది మహిళా నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ 5కి ఉన్నాయా? అని దివ్యవాణి …
Read More »