Home / Jhanshi Rani (page 77)

Jhanshi Rani

నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌కు కేసీఆర్‌ భారీ నజరానా

వరల్డ్‌ ఉమెన్స్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు సీఎం కేసీఆర్‌ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఇషా సింగ్‌కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్‌ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More »

గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీ? ట్వీట్‌ చేసిన బీసీసీఐ చీఫ్‌!

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్‌గా ఆయన చేసిన ట్వీట్‌ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్‌ చేశారు. ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై …

Read More »

దావోస్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్‌.. నేతల ఘనస్వాగతం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.

Read More »

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: పెద్దిరెడ్డి

కుప్పంలో మైనింగ్‌ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు …

Read More »

టీడీపీకి ఎంతో సేవ చేశా.. అయినా నన్ను అవమానించారు: దివ్యవాణి

పార్టీ కోసం ఎంతో చేసినా తనను తీవ్రంగా అవమానించారని సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ఆమె ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా తనను అవమానించారని ఆరోపించారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్‌) స్థాపించిన పార్టీలో కళాకారులు …

Read More »

తెలంగాణలో 2.5లక్షల ఎకరాల్లో ఆలుగడ్డలు పండించాలి: నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో తినేందుకు ఆలుగడ్డను అధికమొత్తంలో వినియోగిస్తారని.. ఇక్కడ ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉండాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంటలసాగుపై సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేవలం ఐదారు వేల ఎకరాల్లోనే ఆలుగడ్డలను పండిస్తున్నారని.. అందుకే యూపీ, గుజరాత్, పంజాబ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 65 నుంచి 70 రోజుల్లోనే ఆలు …

Read More »

కేవీపీ ఇంట్లో చోరీ.. విలువైన డైమండ్‌ నెక్లెస్‌ అపహరణ

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో 49 గ్రాముల డైమండ్‌ నెక్లెస్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేవీపీ భార్య సునీత పోలీసుల కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 11న సునీత ఆ డెమండ్‌ నెక్లస్‌ను ధరించి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అనంతరం ఇంటికొచ్చిన కాసేపటి తర్వాత నుంచి అది కనిపించకుండా …

Read More »

నా హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర: మంత్రి మల్లారెడ్డి

తనను హత్య చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని.. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దాడికి యత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని.. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను చెప్పానన్నారు.

Read More »

టీఆర్‌ఎస్‌ ఎంపీగా గాయత్రి రవి ప్రమాణస్వీకారం

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్‌ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై …

Read More »

నేపాల్‌ ఫ్లైట్‌ యాక్సిడెంట్‌.. 14 మృతదేహాలు గుర్తింపు

నేపాల్‌లో ఆదివారం అదృశ్యమైన తారా ఎయిర్‌కు చెందిన విమానం ఆచూకీని అక్కడి ఆర్మీ సోమవారం ఉదయం గుర్తించింది. 22 మందితో అదృశ్యమైన విమానంలో దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఫ్లైట్‌ కొండల అంచులను ఢీకొట్టినట్లు అంచనా వేస్తున్నారు. కొండలను ఢీకొట్టడంతో విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. 22 మందిలో ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను నేపాల్ ఆర్మీ వెలికితీసింది. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat