సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి, వైకాపా ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జగన్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు …
Read More »హెచ్ఎడీఎఫ్‌సీ అకౌంట్లలో ఒక్కొక్కరికీ రూ.13కోట్లు.. కస్టమర్లు షాక్
వందలు, వేల రూపాయిలు కాదు.. ఏకంగా రూ.కోట్లలో నగదు అకౌంట్లలో జమ అయింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అకౌంట్లలో ఎవరో వేస్తే అలా రూ.కోట్లలో నగదు జమకాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో జరిగింది. ఈ ఘటన తమిళనాడుతో పాటు తెలంగాణలోనూ పలువురికి ఈ అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అంతేసి అమౌంట్ పడటంతో ఖాతాదారులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి చెందిన ఓ …
Read More »అమరుల స్మారక చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు …
Read More »తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్ బాటిల్స్!
ప్రయాణికుల కోసం వాటర్ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మంచి వాటర్ బాటిల్ డిజైన్ సూచించి ప్రైజ్ మనీ గెలుచుకోవాలని సజ్జనార్ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్, లీటర్ పరిమాణాల్లో ఈ వాటర్ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు …
Read More »ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా చంద్రబాబుకు లాభం లేదు: అంబటి
బడుగు, బలహీనవర్గాల పక్షపాతి సీఎం జగన్ అని.. వారికి ఆయన సామాజిక న్యాయం చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి మాట్లాడారు. బస్సు యాత్రకు ప్రతి చోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని.. …
Read More »అదీ జగన్ ఫేస్ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా
టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్
దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …
Read More »‘కిక్ బాబు- సేవ్ ఏపీ’.. ఇదే వైసీపీ నినాదం: విజయసాయిరెడ్డి
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజసాయిరెడ్డి నిలదీశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కిక్ బాబు- సేవ్ ఏపీ’ నినాదంతో తమ పార్టీ ముందుకెళ్తోందని చెప్పారు. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కోటంరెడ్డి అరుంధతి వాడలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయన అనుచరులు కోటంరెడ్డిని నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత చెన్నై హాస్పిటల్‌కి …
Read More »