రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో అదనంగా కెపాసిటీని జోడించాలని.. తద్వారా విద్యుత్ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బి.శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని …
Read More »యాదాద్రిలో కారు పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కారు పార్కింగ్ ఫీజుపై అధికారులు సవరణ చేశారు. కొండపై వాహనాల పార్కింగ్ రూ.500 చొప్పున.. ఆపై ప్రతి గంటకు రూ.100 చొప్పున ఫీజు వసూలు చేస్తామని ఇటీవల ఆలయ ఈవో గీత ప్రకటించారు. అయితే ఆ నిబంధనలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయాబోమని.. ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో …
Read More »యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్ నగర …
Read More »నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి నైట్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ఓ మహిళతో రాహుల్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ పెళ్లి రాహుల్ హాజరైనట్లు లోకల్ మీడియా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైరల్ …
Read More »సురేఖతో చిరంజీవి టూర్.. ‘గాడ్‌ఫాదర్’గుడ్ న్యూస్
మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల ఫారిన్‌టూర్‌కి వెళ్లారు. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాల పర్యటనకు వెళ్తున్న చిరంజీవి తెలిపార. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేఖతో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. మరోవైపు ఇటీవల ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూ …
Read More »అద్దెకు ఇల్లు చూస్తామని వెళ్లి.. లోపల పనికానిచ్చేశారు!
ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు. …
Read More »హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్ పరిధిలోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైలు ఛార్జీలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 5 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఫలక్‌నుమా- సికింద్రాబాద్, హైదరాబాద్- లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన …
Read More »తెలంగాణకు మూడురోజుల వర్షసూచన
ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఈదరుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని.. మూడు డిగ్రీల వరకు పెరగొచ్చని …
Read More »ప్రిన్స్ మహేశ్ నోట జగన్ డైలాగ్.. సోషల్ మీడియాలో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మహేశ్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తన పాదయాత్ర సమయంలో ఉపయోగించిన మాటను ఈ మూవీలో చిత్రబృందం వాడింది. మహేశ్ చేత ఆ డైలాగ్ చెప్పించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ వ్యాప్తంగా జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ‘నేను విన్నాను.. నేను …
Read More »రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …
Read More »