బీజేపీ నుంచి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చేశాడా? ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది. ఘట్‌కేసర్ సమీపంలోని తన అనుచరులతో తీన్మార్‌మల్లన్న ఆదివారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాలను మార్చేది తమ టీమ్ మాత్రమేనని.. అది బీజేపీ కన్నా లక్ష రెట్లు గొప్పదన్నారు. ఇకపై బీజేపీ ఆఫీస్‌కి వెళ్లనని ప్రకటించారు. మల్లన్న చేసిన ఈ కామెంట్స్ …
Read More »ఉదయం టిఫిన్ స్కిప్ చేస్తున్నారా? అయితే ఇది చదవండి..!
సరైన సమయానికి ఆహారం తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఉదయం టిఫిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. మధ్యాహ్న భోజనానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయాన్ని లేచిన తర్వాత మొదటి రెండు గంటల్లో పొట్ట నింపుకోవాలి. అలా తినకపోతే ఎన్నో అనర్థాలు చుట్టుముట్టేప్రమాదముందని.. సమస్యలు కొనితెచ్చుకుంటున్నట్లేనని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. రాత్రంతా ఆహారం లేకుండా పొట్ట ఖాళీగా ఉండటంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోయి నిస్సత్తువ వచ్చేస్తుంది. …
Read More »ముంబయిలో శ్రీవారి ఆలయానికి రూ.500కోట్ల స్థలం..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల …
Read More »మేం అడ్డుకుంటే బీజేపీ నేతలు తిరగలేరు: బాల్క సుమన్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చిన సందర్భంగా శంషాబాద్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అడ్డుకోవడమే పని అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో …
Read More »ఘోరం.. సెక్యూరిటీ గార్డును తలకిందులుగా వేలాడదీసి చితకబాదారు!
దొంగతనం ఆరోపణలతో ఓ సెక్యూరిటీ గార్డును కొందరు యువకులు చిత్రహింసలకు గురిచేశారు. తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సివత్ పట్టణానికి చెందిన మహవీర్‌ను ఎవరూ లేని ప్రదేశానికి కొంతమంది యువకులు తీసుకెళ్లారు. చెట్టుకు వేలాడదీసి కర్రలు, ఇనుపరాడ్డులతో విపరీతంగా దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని ఏడ్చినా ఆ యువకులు కనికరం చూపలేదు. అయితే అటుగా వెళ్తున్న ఓ మహిళ …
Read More »టీడీపీ వాళ్లే నాపై దాడి చేయించారు: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
జి.కొత్తపల్లిలో వైసీపీ నేతలు తనపై దాడి చేయలేదని..టీడీపీ వాళ్లే వెనకుండి దాడి చేయించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. జి.కొత్తపల్లిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. వారి మధ్య వివాదాన్ని రాజీ చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. హత్యకు గురైన గంజి …
Read More »‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత
వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …
Read More »సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన ఫొటో ఫ్రేమ్‌ను జ్ఞాపికగా రోజా అందజేశారు. అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి …
Read More »టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్
యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »నార్త్, సౌత్ ‘సినిమా వార్’.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్
ఇటీవల నార్త్, సౌత్ సినిమాల విషయంపై ట్విటర్ వేదికగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. కేజీయఫ్ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ చేశారని.. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ …
Read More »