Home / Jhanshi Rani (page 95)

Jhanshi Rani

ఫుడ్‌ క్వాలిటీపై జొమాటో కొత్త రూల్‌.. రెస్టారెంట్‌ ఓనర్ల తీవ్ర అసంతృప్తి

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో కొత్త రూల్‌ తీసుకురానుంది. ఫుడ్‌ క్వాలిటీపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రెస్టారెంట్లను తనిఖీ చేసి తమ యాప్‌లో తాత్కాలికంగా బ్యాన్‌ చేయనుంది. ఈ మేరకు ఇటీవల అన్ని రెస్టారెంట్ల మేనేజ్‌మెంట్లకు లేఖలు రాసింది. FSSAI ఆధ్వర్యంలోని సంస్థలు తనిఖీ చేసి ఓకే చెప్పిన తర్వాతే బ్యాన్‌ ఎత్తివేస్తామని.. అంతవరకు ఆయా రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతుందని జొమాటో పేర్కొంది. దీంతో …

Read More »

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!

భాగ్యనగర వాసులకు ఊరట కలిగించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఇది కాస్త ఉపశమనం. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీకి నార్త్‌, వెస్ట్రన్‌ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయని.. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ …

Read More »

రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్‌!

హనుమాన్‌ జయంతి నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్‌ శోభాయాత్ర జరనున్నందున సిటీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయని తెలిపారు. 16వ తేదీ (రేపు) ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ (ఎల్లుండి) ఉదయం 6 గంటల వరకు వైన్‌షాప్‌లు బంద్‌ అవుతాయని తెలిపారు. మరోవైపు హనుమాన్‌ శోభాయాత్రకి 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడలోని రామాలయం నుంచి తాడ్‌బండ్‌లోని హనుమాన్‌ …

Read More »

మీ పాదయాత్రకు ఆ పేరు పెట్టుకోండి: బండిపై కేటీఆర్‌ ఫైర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్‌ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. …

Read More »

ఈ మామిడితోటకి ఫుల్‌ సెక్యూరిటీ.. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్‌!

సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్‌? టేస్ట్‌, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్‌. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది. జంబో గ్రీన్‌ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్‌ కేసర్‌’ సహా నేపాల్‌ రకం …

Read More »

మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం: కేటీఆర్‌

దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి …

Read More »

అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌  చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్‌ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌లో కలకలం.. హాట్‌టాపిక్‌గా హార్దిక్‌ కామెంట్స్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్‌లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్‌ పటేల్‌ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్‌ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్‌ మీడియా సంస్థతో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ …

Read More »

అవసరమైతే ఆ ఫ్యాక్టరీ మూసేస్తాం: మంత్రి తానేటి వనిత

ఏలూరు జిల్లాలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని …

Read More »

అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్‌ పాలన

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా స్పీకర్‌ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat