Home / ANDHRAPRADESH / అవసరమైతే ఆ ఫ్యాక్టరీ మూసేస్తాం: మంత్రి తానేటి వనిత

అవసరమైతే ఆ ఫ్యాక్టరీ మూసేస్తాం: మంత్రి తానేటి వనిత

ఏలూరు జిల్లాలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని మూసేస్తామని తెలిపారు.

ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోరస్‌ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్‌లో గ్యాస్‌ లీకై మంటల చెలరేగడంతో రియాక్టర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమవగా. మరొకరు హాస్పిటల్‌కి తరలిస్తుండగా చనిపోయారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum