తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా కోరనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధానమంత్రితో చర్చిస్తారు. హైకోర్టును సత్వరం విభజించాల్సిందిగా ప్రధానిని కోరనున్నారు. వీటితో పాటు …
Read More »ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగునీరు అందించడమే కేసీఆర్ ఆశయం.!!.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మిషన్ భగీరథ పథకం అమలుపై శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు మరియు అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరధ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన, స్వచ్చమైన త్రాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. ముఖ్యమంత్రి ఆశయానికి …
Read More »110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్..మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ప్లాస్టిక్ ఎక్సిబిషన్ ఐప్లెక్స్ 2018 ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలని సూచించారు.ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు …
Read More »కేసీఆర్ తెలంగాణ గాంధీ..!!
టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అని ఎమ్మల్సీ రాములు నాయక్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించి.. జాతిపిత, మహాత్మ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని అన్నారు.తండాలను గ్రామపంచాయితీలు గా మార్చడం వలన గిరిజనులకు అసలైన స్వతంత్ర్యం వచ్చిందని చెప్పారు. కొన్ని దశాబ్దాల కల,గిరిజనుల ఆత్మగౌరవాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »అన్ని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, వృత్తివిద్య కాలేజీల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు సచివాలయంలో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, …
Read More »తెలంగాణలో రాహుల్ పర్యటన..ఎదుకంటే..?
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది. ఈనెల 13, 14 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిం చనున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య బస్సుయాత్రలో పాల్గొనడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అయన అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. 13న బస్సుయాత్రలో రాహుల్ పాల్గొంటారని, మరుసటి …
Read More »డీఎస్ కుమారుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) తనయుడు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇవాళ సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే గత 6 నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో చెప్పారు. ఈ సంఘటనపై మహిళా సంఘాలు ఒక్కసారిగా భగ్గమన్నాయి. ఆయనను తక్షణమే …
Read More »రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి కొత్త జోనల్ …
Read More »తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …
Read More »అల్వాల్ రైతు బజార్ ను అద్భుతంగా తిర్చిదిద్దుతాం..!!
అల్వాల్ రైతు బజార్ ను సీఎం ఆదేశాల మేరకు ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ కు ఆనుకుని ఉన్న కంటోన్మెంట్, రైల్వే, ఆర్ అండ్ బిలకు సంబంధించిన స్థలం కొంత తమకు అప్పగిస్తే అల్వాల్ రైతు బజార్ ను …
Read More »