కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42ఏండ్లు పరిపాలించి పేదవర్గాలను అణచివేసిన పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేక నిత్యం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా …
Read More »కత్తి మహేష్‌పై పోలీసుల చర్య..ప్రభుత్వం ఆలోచన ఏంటంటే..?
వివాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వివిధ పార్టీలు స్పందించగా తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రియాక్టయ్యారు. కత్తిమహేష్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్య అభినందనీయమని, డీజీపీ నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం స్వాగతిస్తున్నదని కర్నె తెలిపారు. ఒక్క మహేష్ మాత్రమే కాదు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు …
Read More »బ్రేకింగ్ : రేపటి మంత్రివర్గ సమావేశం వాయిదా..!!
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ఆయన ఈ సూచనలు చేశారు. మంత్రులు కూడా తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. …
Read More »నేను అమెరికాలో పని చేస్తూ చదువుకున్నా..ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజినీరింగ్ ప్రతి బ్రాంచ్‌లో టాపర్స్‌కు సర్టిఫికెట్స్ అందజేశారు. కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం బ్లాక్‌తో పాటు ప్లేస్‌మెంట్, రిక్రూట్‌మెంట్ సెల్‌ను ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..”బాగా కష్టపడి ప్రతిఒక్కరు చదవాలి. నా …
Read More »కడియంకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..!!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన సందర్భంగా గవర్నర్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరిగారు పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని పుట్టిన రోజు శుభాకాంక్షల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, టిఆర్ఎస్ …
Read More »శరత్ ని కాల్చి చంపింది ఇతనే..!!
అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శరత్ ను కాల్చి చంపిన నల్ల జాతీయ వ్యక్తి ఇతడే అంటూ ఓ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు . నిందితున్ని పట్టించినవారికి 10 వేల డాలర్ల బహుమతిని ప్రకటించారు. దీనికి సంబంధిన వీడియోను ట్విట్టర్ లో కన్సాస్ పోలీసులు పోస్ట్ చేశారు . దోపిడీ …
Read More »మరో 20 సంవత్సరాలు కేసీఆరే సీఎం..!!
రానున్న మరో ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల బతుకంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళుమండి కేసులేస్తున్నారని, ఇక …
Read More »శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..కేటీఆర్
అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్‌పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన …
Read More »పత్తికొండలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు..!!
ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి వేడుకలు పత్తికొండ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి.నియోజకవర్గం లోని వెల్దుర్తి పట్టణం నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పత్తికొండ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలోని …
Read More »యూట్యూ బ్ లో సంచలనం సృష్టిస్తున్న వైఎస్సాఆర్ బయో పిక్ టీజర్
నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే అయన జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మళయాళ మెగాస్టార్ మమ్ముటీ వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి రాఘవ డైరెక్షన్‌లో ‘యాత్ర’ తెరకెక్కుతోంది. అయితే ఇవాళ అయన జన్మదినం సందర్బంగా చిత్ర నిర్వాహకులు అర్ధరాత్రి 12 గంటలకు …
Read More »