వచ్చే నెల నవంబర్ 6 నుంచి ఆరు నెలలపాటు పాదయాత్రను తలపెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నెల 28నుంచి లండన్ లో పర్యటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న లండన్ కు వెళ్లనున్న జగన్, 2వ తేదీలోగా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న శుక్రవారం కోర్టు విచారణ తరువాత ఆయన బయలుదేరుతారని, తిరిగి 3న విచారణలోగా …
Read More »నేడు అసెంబ్లీలో 9 బిల్లులను ప్రవేశపెట్టనున్నప్రభుత్వం
అసెంబ్లీ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభంకానున్నాయి.ఈ క్రమంలో మొదటి రోజు ప్రశ్నోత్తరాల తర్వాత సభ ఆమోదానికి ప్రభుత్వం 9 బిల్లులను ప్రవేశపెట్టనున్నది. వ్యాట్ చట్ట సవరణ, పీడీయాక్ట్ సవరణ, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లు, గేమీ ఆర్డినెన్సుకు ఆమోదం, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్సులకు ఆమోదం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎక్సైజ్ చట్టాలకు సవరణల బిల్లులను ఆమోదం కోసం సభ లో ప్రవేశపెడుతారు. ఎన్పీడీసీఎల్ 2015-16 వార్షి క నివేదికను, టీఎస్‌టీఎస్ …
Read More »నేడు చంద్రబాబుతో టీ టీడీపీ నేతల సమావేశం..అందుకేనా..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో నేడు తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేతలు ఉదయం 11గంటలకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశంకానున్నారు. తొమ్మిది రోజుల విదేశీ పర్యటన అనంతరం చంద్రబాబు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే… 11గంటలకు సమావేశం నిర్వహిస్తుండగా ఈ సమావేశానికి రావాలని రేవంత్‌రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ప్రధానంగా రేవంత్‌రెడ్డి అంశమే చర్చకు వచ్చే సూచనలు …
Read More »ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్
టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష సమావేశంలోముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై ఫైర్ అయ్యారు. భూపతిరెడ్డి స్ధానిక నాయకత్వాన్ని కలుపుకుని పోవడంలేదని, అక్కడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌తో తరచూ గొడవపడడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చింది.వాళ్లిద్దరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ మందలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌తో రాజీ కుదుర్చుకోవాలని, లేని పక్షంలో పార్టీ తరపున చర్య తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.ఇటీవల వివాదంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ …
Read More »28న లండన్ కు వైఎస్ జగన్..
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28 నుంచి లండన్, యూరప్ లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో లండన్ టూర్‌కు అునమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆరు రోజుల లండన్ టూర్‌కు అనుమతి ఇవ్వాలని ఆయన మెమో సమర్పించారు. దీంతో లండన్ వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని వైసీపీ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, …
Read More »భరత్ అనే నేను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం భరత్ అనే నేను. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించినా.. స్పైడర్ రిజల్ట్ తేడా కొట్టేయటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అందుకు తగ్గట్టుగా సినిమాను వేసవికి వాయిదా వేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న …
Read More »రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్ సంచలన ప్రకటన
సినీ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన ప్రకటన విడుదల చేశారు. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. అందరు ‘సిద్ధంగా ఉండండి.. అన్ని విషయాలు నవంబరు 7న చెబుతా’ అంటూ ఆయన తమిళ పత్రిక ఆనంద్ వికటన్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి యువశక్తి అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుందన్నారు. వారికి నేతృత్వం వహించాల్సిన సమయం …
Read More »రేపు హైదరాబాద్‌కు చంద్రబాబు..?
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం 5.15గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం అయన ఉదయం 11గంటలకు గవర్నర్ నరసింహన్‌ను పరామర్శిస్తారు. ఇటీవలే గవర్నర్ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. తరువాత మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Read More »వచ్చే ఎన్నికల్లో 96-104 సీట్లు ఖాయం..సీఎం కేసీఆర్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి 96-104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేంది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో …
Read More »మహిళా కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పురుపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ మహిళా కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జీహెచ్ఎంసీ మహిళా కార్పోరేటర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవకాశం ఉన్నదని, ఆ దిశగా ఆలోచించాలని వారిని కోరారు. ప్రభుత్వం నగరంలోని …
Read More »