డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు..
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు. …
Read More »భారత్ లో 30,000 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,200కి చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 947గా ఉన్నది. 8,500 వైరస్ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. తమిళనాడులో మంగళవారం కొత్తగా …
Read More »పునర్జన్మనిచ్చిన తెలంగాణ-వృద్ధుడు
కూతురిని చూసేందుకు అమెరికా వెళ్లొచ్చిన వృద్ధ దంపతుల్లో భర్తకు కరోనా సోకినప్పటికీ కోలుకున్నారు. 70 ఏండ్ల వయస్సులో మహమ్మారి బారినుంచి బయటపడటం, ప్రభు త్వం చేపట్టిన చర్యల ఫలితమేనని ప్రశంసించారు. గాంధీ దవాఖానలో సేవలను కొనియాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం తనకు పునర్జన్మనిచ్చిందని కితాబిచ్చారు. అమెరికాలో వైరస్ విజృంభణను, హైదరాబాద్‌లో చికిత్సను ప్రత్యక్షంగా చూసిన ఆయన తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ‘గత ఏడాది చివరలో అమెరికాకు వెళ్లాం. …
Read More »40 లక్షల టన్నుల సామర్థ్యం ఉండేలా 8 నెలల్లో కొత్త గోదాములు
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్రవ్యూహాన్ని ఖరారుచేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు …
Read More »ఐసీఎంఆర్ ప్రకారమే పరీక్షలు.. ప్రైవేట్ ల్యాబ్‌లను అనుమతించేది లేదు
రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు …
Read More »కరోనానా? కావసాకీనా?
ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న బ్రిటన్, ఇటలీ దేశాల్లోని చిన్నారుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం ఆందోళన కలిగిస్తున్నది. అధిక జ్వరం, రక్తనాళాల్లో వాపు వంటి లక్షణాలతో పెద్ద సంఖ్యలో పిల్లలు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ వ్యాధికి, కరోనా మహమ్మారికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నదానిపై ఇరుదేశాల వైద్య నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. కావసాకీ వ్యాధి తరహా లక్షణాలతో ఉత్తర ఇటలీలో తొమ్మిదేండ్లలోపు చిన్నారులు దవాఖానల్లో చేరుతున్నారు. అలాగే బ్రిటన్‌లోని చిన్నారుల్లోనూ …
Read More »ఏపీలో కరోనా రోజుకో రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది …
Read More »అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం
ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
Read More »కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ …
Read More »