దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజులో దేశ వ్యాప్తంగా మొత్తం 2,34,281మంది కరోనా బారీన పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.10కోట్లకు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క యాబై వేల కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. గత ఇరవై నాలుగంటల్లో 893మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,94,091కి చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,19,396 …
Read More »తెలంగాణలో కొత్తగా 2,484 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,484 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం మొత్తం 65,263మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.61లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తంగా 7.18లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఆదివారం కరోనాతో ఒకరు మరణించగా ఇప్పటివరకు 4,086మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 38,723 …
Read More »తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లు
తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ బైక్ లను వచ్చే రెండేండ్లలో ఈఎంఐ వాయిదాల పద్ధతిలో పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇందన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో వచ్చే రెండు మూడు నెలల్లో 1000 ద్వి చక్రవాహానాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది . హైస్పీడ్ ,లోస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా కోసం తయారీదారుల నుండి ఆసక్తి వ్యక్తీకరణను …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా ఖమ్మం ప్రధాన సర్కారు దవాఖానలో భర్త సమక్షంలో పురుడు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు దవాఖానలో తొలిసారిగా భర్త సమక్షంలో పురుడు పోసిన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు ఆసుపత్రిలో ఈ సంఘటనకు నాంది పలికారు వైద్యులు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ఓడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి ,గాయత్రి,స్టాఫ్ నర్సు అరుణ నూతన విధానంలో శ్రీలత అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ …
Read More »తెలంగాణలో చమురు రిగ్గుల తయారీ పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ స్పా (ఇటలీ) చమురు రిగ్గులు,దాని అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. దీని గురించి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు సమక్షంలో ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నది. భారీ పెట్టుబడితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు …
Read More »సునీల్ హీరోగా “అతడు..ఆమె.. ప్రియుడు”
ముందు కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కమెడియన్ గా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న నటుడు సునీల్. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు సునీల్. ఇటీవల ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …
Read More »ఫిబ్రవరి 4న సుదీప్ మూవీ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు సుదీప్. ఈగ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న విభిన్న నటుడు సుదీప్. సుదీప్ హీరోగా శివ కార్తిక్ దర్శకుడిగా శ్రేయాస్ శ్రీనివాస్ ,దేవేంద్ర డీకే నిర్మాతలుగా మడోన్నా సెబాస్టియన్ ,శ్రద్దహాదాస్ హీరోయిన్లుగా నటించిన చిత్రం “కే3 కోటికొక్కడు వస్తున్నాడు.ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఓ ప్రత్యేక గీతంలో నటిస్తుంది. ఈ సినిమాను …
Read More »జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read More »విడాకులు పై హాట్ యాంకర్ హిమజ క్లారిటీ
బిగ్‌బాస్ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది.’ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, …
Read More »రుషికొండ బీచ్‌లో మంగ్లీ
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌లో శనివారం సాయంత్రం ప్రముఖ గాయని మంగ్లీ సందడి చేసింది. ఓ ప్రైవేటు ఆల్బమ్ పాట చిత్రీకరణలో భాగంగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తూ మంగ్లీ పాట పాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈమెతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.అలాగే మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
Read More »