తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు
పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ పలు భాషల్లో ట్వీట్లు చేశారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Read More »విటమిన్ D కావాలంటే ఏమి చేయాలి…?
విటమిన్-D కోసం ఏం తినాలి?..ఏమి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం… * ఆవు పాలు తాగాలి * ఆరెంజ్ జ్యూస్ తాగాలి * ఓట్స్ తినాలి * యోగర్ట్ తీసుకోవాలి * పుట్టగొడుగులు తినాలి * కోడిగుడ్లు తినాలి * మజ్జిగ ఎక్కువగా తాగాలి * ఫ్రూట్ సలాడ్ తినాలి * ఉదయం పూట ఎండ ద్వారానూ విటమిన్-D పొందవచ్చు
Read More »అరిసెలు వల్ల లాభాలెన్నో…?
సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి తెలుగింట్లో 3 తప్పనిసరిగా ఉండే పిండివంటకం అరిసెలు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. బెల్లం రక్తాన్నిశుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.
Read More »యూపీ అసెంబ్లీ ఎన్నికలకి తొలి విడత నోటిఫికేషన్ విడుదల
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యాయి.. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Read More »సంక్రాంతి కి ఆర్జీవీ తనదైన స్టైల్లో విషెష్
అసలు పండగలకు శుభాకాంక్షలు చెప్పడమే ఇష్టపడని వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు. ‘మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు’ …
Read More »సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2తేడాతో భారత్ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. సౌతాఫ్రికా టీమ్ పీటర్సన్-82, డుసెన్-41, ఎల్గర్-30 రాణించారు. * టీమిండియా స్కోర్లు 223 & 198 * సౌతాఫ్రికా స్కోర్లు 210 & 212/3
Read More »చలికాలం సీజన్ లో జుట్టు రాలుతుందా…?
చలికాలం సీజన్ లో ఇంటి చిట్కాలు ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించడంలో బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. నీళ్లు పోసి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఈ నీళ్లను ఫ్రిజ్లో పెట్టుకుని జట్టుకు పట్టించి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన మెంతుల పేస్టులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించినా రిజల్ట్ కనిపిస్తుంది.
Read More »నా హత్యకు కుట్ర జరుగుతుంది..
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …
Read More »తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.
Read More »