సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. తయారు చేయడానికి ఆవు పేడను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని పెళ్లికాని అమ్మాయిలు తయారు చేస్తే త్వరగా పెండ్లి అవుతుందని నమ్ముతారు. పేడతో చేసే గొబ్బెమ్మల్లో క్రిమి కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది.
Read More »తెలంగాణలో కొత్తగా 2,319కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90,021 టెస్టులు చేయగా కొత్తగా 2,319 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు నమోదయ్యాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గత 24 గంటల్లో GHMC పరిధిలో 1,275 …
Read More »మంత్రి కొడాలి నానికి కరోనా
ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
Read More »ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నారా ..అయితే ఇది మీకోసమే..?
ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు. 3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. …
Read More »ఒమిక్రాన్ కు వ్యాక్సిన్
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంటు కి మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.
Read More »కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సర్జరీలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో నిన్న కొత్తగా 1,831 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం 984 కేసులు వెలుగు చూశాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 7,195యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
Read More »సీఎం కేసీఆర్ తో తేజస్వీ యాదవ్ భేటీ అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ పాలసీ, విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ …
Read More »గ్రేటర్ లో కొత్తగా 1,015 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,015 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,56,344 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More »మహానటికి కరోనా
కరోనా థర్డ్వేవ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్కు వైరస్ సోకింది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం కీర్తి.. గుడ్ లక్ సఖి, చిరుతో భోళా శంకర్, మహేశ్తో సర్కారు వారి పాట, నానితో దసరా సహా పలు క్రేజీ సినిమాల్లో 3 నటిస్తోంది.
Read More »