రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది.
అత్యవసర సర్జరీలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.