తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన దీక్ష గుర్తుకు వస్తే ఒళ్లు పులకరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను, అమరుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణగా మారుస్తున్నారని కొనియాడారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలందరి అదృష్టమని వ్యాఖ్యానించారు.
Read More »రాధాకృష్ణ కుమార్ తో Style Star
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ పూర్తయ్యాక రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్తో ఓ సినిమా చేయనున్నాడని టాక్. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి తెగ నచ్చేసిందట. వెంటనే స్క్రిప్ట్ పూర్తిచేయాలని చెప్పాడని సమాచారం. అటు, రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ చేయబోయే సినిమా ఇదేనట.
Read More »మాస్కులు పెట్టుకోండయ్యా..?
‘కరోనా లేదు బిరోనా లేదు’ అని చాలా మంది మాస్కు పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతుండటంతో మాస్కు తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ రాదనేది తప్పుడు ప్రచారమని, 2 డోసుల టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు.
Read More »గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి మళ్లీ అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.
Read More »కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధం
కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నదని, రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్‌ను ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. …
Read More »BigBoss కి యాంకర్ రవి ఎంత తీసుకున్నాడో తెలుసా..?
ఎవరు ఊహించని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన యాంకర్ రవి పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. మరో రెండు వారాలు ఉంటే చాలా మొత్తం చెల్లించాల్సి ఉంటుందని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం ఊహించని ఎలిమినేషన్‌తో బయటకు పంపించినట్టు టాక్స్ నడుస్తున్నాయి. రవి బిగ్ బాస్ …
Read More »దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,80,832కు చేరింది. ఇందులో 3,40,08,183 మంది కోలుకున్నారు. మరో 1,03,859 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,68,790 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 9905 మంది కరోనా నుంచి బయటపడగా, 236 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 544 రోజుల కనిష్ఠానికి చేరాయని …
Read More »కెనడాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్
ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వెస్ తెలిపారు. మానిటరింగ్, టెస్టింగ్ ప్రక్రియ …
Read More »నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. …
Read More »రైతన్న కోసం రణమే.. పార్లమెంటులో గళమెత్తండి- సీఎం కేసీఆర్
ఆహారధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికే కాకుండా.. యావత్ దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆహారధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, పార్లమెంటు వేదికగా ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ …
Read More »