‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ హీరోయిన్ సమంత పాత్రికేయులపై సీరియస్ అయ్యారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన ఆమె, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సమయంలో మీడియావారు ఆమెని ఓ ఫొటో తీసుకుంటామని రిక్వెస్ట్ చేశారు. దానికి ఆమె ‘గుడికి …
Read More »తెలంగాణలో పోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, …
Read More »అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Read More »త్రిపురారం మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే భగత్ విస్తృతస్థాయి సమావేశం
హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రిపురారం మండల ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమంలో స్థానిక నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కమిటీల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి గారు.. త్రిపురారం మండలం,నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్ష, కార్యదర్శుల నియామకాల గురించి, మండల కమిటీ ఎన్నికల నియామకాల గురించి మండల నాయకులతో విధివిధానాలు తెలుసుకుని మండల కమిటీల గురించి చర్చిచి మండల అధ్యక్షుల, కార్యదర్శులను …
Read More »టీమిండియా తర్వాత కోచ్ అనిల్ కుంబ్లే
T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనిల్ కుంబ్లేను BCCI సంప్రదించిందట. గతంలో కుంబ్లే కోచ్గా పనిచేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం IPLలో PBKS కోచ్ ఉన్నాడు. కుంబ్లే తో పాటు కోచ్గా లక్ష్మణ్ను సంప్రదించిందట. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ గురించి BCCI ఆలోచన చేస్తోందట.
Read More »దేశంలో కొత్తగా 35,662 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా కరోనా బాధితుల సంఖ్య 3,34,17,390కు పెరిగింది. మరో 281 మంది మృతి చెందగా.. కరోనా మరణాల సంఖ్య 4,44,529కు చేరింది. మరో 33,798 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3,26,32,222 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,40,639 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఫ్యాన్ చేసిన పనికి సమంత ఎమోషనల్
టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత తన ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. పవన్ అనే ఓ అభిమాని హీరోయిన్ సమంత పేరును SAMMUగా చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. సమంతను ట్యాగ్ చేస్తూ.. ‘నా ఫస్ట్ లవ్ & లాస్ట్ లవ్’ అంటూ ఆ ఫోటోలను ట్వీట్ చేశాడు. ఎమోషనల్ ఎమోజీలతో ఈ పోస్టును సామ్ రీట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. సామ్ తనకు …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ జంటగా అనుభూతి కశ్యప్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డాక్టర్ జీ’. ఈ చిత్రంలో ఫాతిమా అనే మెడికో పాత్రలో రకుల్ నటిస్తోంది. సినిమా కోసం డాక్టర్ల మేనరిజమ్స్ ఫాలో అయ్యానని పలువిషయాలు చెప్పుకొచ్చింది.. ఈ బ్యూటీ. ‘డాక్టర్ కోటు ధరించగానే చాలా బాధ్యతగా ఫీలయ్యేదాన్ని. వారి జీవితాలు ఎంత కష్టమో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లగానే నేను రకుల్ ప్రీత్ సింగ్ ను కాదు అనిపించేది’ …
Read More »రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. సీఎం జగన్, పలువురు మంత్రులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు(మ) కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో అయ్యన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదులో కోటేశ్వరరావు పేర్కొన్నారు.
Read More »