గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …
Read More »తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ
బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రావెంకటేశం, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన బిసి కమిషన్ ఛైర్మన్, సభ్యులు.నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసి సంక్షేమ …
Read More »కోవిడ్19 నివారణలో కీలకం కానున్న అత్యంత విష సర్పం
అత్యంత విష సర్పమే.. కోవిడ్19 నివారణలో కీలకం కానున్నది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌లో ప్రచురించారు. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 …
Read More »మొదలైన పవన్ బర్త్ డే వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కాని, పవన్ బర్త్ డే వేడుకలు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. రేపు పవన్ 50వ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా జరపాలని భావిస్తున్నారు. ఒకవైపు పవన్ బర్త్ డే హంగామాతో పాటు మరోవైపు ఆయన పేరుతో పలు …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్‌ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 …
Read More »తెలంగాణ భవన్ -జయించిన ధర్మమా.. ఇదీ నీ చిరునామా!
1969 జూలై 20వ తేదీన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై పాదం మోపిన ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఊపిరి బిగబట్టి వీక్షించారు. ఆమ్‌స్ట్రాంగ్ విజయాన్ని తమ విజయంగా భావించి పొంగిపోయారు. ‘ఒక మానవుడి అడుగు, మానవ జాతికి పెద్ద అంగ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మరిచిపోలేనివి. 1947 ఆగస్టు 15న ఇండియా గేట్ సమీపాన ప్రిన్సెస్ పార్క్ మైదానంలో తొలి ప్రధాని నెహ్రూ పతాకావిష్కరణ జరిపినప్పుడు …
Read More »దేశంలో కొత్తగా 30,941 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 30,941 కేసులు నమోదవగా తాజాగా 41 వేలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 35.6 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు చేరింది. ఇందులో 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,78,181 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,39,020 …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి …
Read More »త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …
Read More »అగ్రిహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, …
Read More »