బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈటల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్.. 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు …
Read More »ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని …
Read More »దేశంలో కొత్తగా 50,040 కరోనా కేసులు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3,95,751 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1,258 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో …
Read More »గోవాలో అల్లు అర్జున్ తో రష్మిక మంధాన రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రపంచాన్ని ఆగం చేస్తున్న కరోనా మహమ్మారి వలన ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఈ మూవీ షూటింగ్ పునర్ …
Read More »పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్ధిక భరోసా సీఎం సహాయ నిధి-ఎమ్మెల్యే అరూరి
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు, తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, కాజిపేట, హన్మకొండ మండలాలకు చెందిన 44మంది లబ్ధిదారులకు 16లక్షల 53వేల విలువగల చెక్కులను హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు …
Read More »ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేందర్‌గా పిలవాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలతో బీఎస్సార్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమన్ హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైందేనని, కానీ బీజేపీ ఫేక్ లేఖగా చిత్రీకరించి …
Read More »హుజురాబాద్‌లో ఈటలకు షాక్
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ బీజేపీ నేతలు షాకిచ్చారు. ఇల్లందకుంట మండల బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌తో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 ఏళ్లుగా బీజేపీతో ఉన్నామని, ఈటల వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »కత్తి మహేష్ పరిస్థితి విషమం
చెన్నై– కలకత్తా రహదారిపై తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు. — ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేష్. ప్రమాడంలోమహేష్ తలకు తీవ్ర గాయాలు. — స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. — మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంట హాస్పిటల్ వైద్యులు. — మరికొన్ని …
Read More »సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు
సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు. చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు …
Read More »సీఎం జగన్ పై మంత్రి పువ్వాడ ఫైర్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని, ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేంద్రానికి అబద్దాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా …
Read More »