టీపీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమయం, సందర్భం వచ్చినప్పుడు టీపీసీసీపై మాట్లాడతానని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు. వి. హనుమంతురావు పార్టీలో చాలా సీనియర్.. వారి ఆవేదన వారిదన్నారు. తనకు టీపీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి లేఖ రాశానని జగ్గారెడ్డి చెప్పారు. టీపీసీసీ ఇవ్వకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సియం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పునఃర్నిర్మాణం …
Read More »తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు.
తెలంగాణ కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,03,369కి పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 5,78,748 మంది కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 21,137 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,484కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా …
Read More »ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
తెలంగాణలో వానకాలం రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందుతుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు …
Read More »పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని …
Read More »మాస్టర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7
2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్ వెబ్‌సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్ స్టోరీ- ఐదో స్థానంలో నిలవగా, ధనుష్ చిత్రం కర్ణన్- 6, పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ చిత్రం-7, క్రాక్ 9వ స్థానం …
Read More »దేశంలో కరోనాపై శుభవార్త
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. 24 గంటల్లో 3921 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం కేసుల …
Read More »రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం…
రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం… జననం సాధారణ రైతు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు పొందిన కళ్ళం అంజిరెడ్డి గారు 1940లో గుంటూరు జిల్లా తాడెపల్లిలో జన్మించారు ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం… అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు …
Read More »ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?
రేపు మంగళవారం BJP లో చేరనున్న ఈటల రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని ఆయన అనుచరులు, అభిమానుల ఆశ.కానీ అది అంత సులభం కాదు.2014 లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడంతో ఏబీవీపీ,ఆర్ ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లోని నాయకులు బిజెపి పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో కొందరికి బిజెపి ప్రభుత్వంలో …
Read More »రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ
తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. …
Read More »