Home / SLIDER / రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ

రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ

తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.

150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. ఈ సారి రూ.14,800 కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.